Saturday, May 31, 2014

సెక్స్ ప్రాబ్లమ్స్

అడగకుండానే చెపుతా
సెక్స్‌ మీద ఉన్నన్ని అపోహలు మరే ఏ అంశం మీద లేవు అంటే అతిశయోక్తి కాదు. సెక్స్‌ అంటే పాపం అనే భావన మనలో పాతుకుపోవడమే ఇందుకు కారణం. సెక్స్‌ సమస్యలను ఎవరికీ చెప్పుకోకుండా మధనపడడం మనవాళ్ళు చేసే పని. అందుకే సెక్స్‌ పై బోల్డన్ని సందేహాలు. చదువుకున్న వారికి కూడా సరైన పరిజ్ణానం, అవగహన లేదని అనేకమైన పరిశోధనల్లో తేలింది. ముద్దు పెట్టుకుంటే కడుపొస్తుంది అని భయపడే చింతామణులు ఈ రోజుల్లో లేకపోయినా సందేహాలున్న దేహాలకు కొదవలేదు. చాలామందికి ఉండే సందేహాలను ఒక దగ్గర చేర్చి, కూర్చి సమస్యలను తీర్చే శీర్షిక ఇది.
సెక్స్‌ లో అధికంగా పాల్గొనడం వల్ల శక్తి తగ్గుతుందా?
నో. సెక్స్‌ కు, శక్తి కోల్పవడానికి సంబంధం లేదు. వీర్యం కోల్పోవడం అంటే శక్తిని వదులుకోవడం కాదు. నిజానికి వీర్యం ఉత్పత్తి అనేది మన చేతిలో లేదు. మీరు సెక్స్‌ లో పాల్గొన్న, పాల్గొనకపోయిన అది ఎలాగూ పోతుంది-నిద్రలో. సో... దాని గురించి ఆందోళన చెందడం దండగ. మన శరీరం నుంచి వెలువడే మూత్రం, కన్నీళ్ళు, లాలాజలం లాగా వీర్యం కూడా మామూలు ద్రవమే. కాకపోతే మిగతా ద్రవాలు పిల్లలను పుట్టించలేవు. అదే తేడా.
హస్తప్రయోగం(మాస్టర్బేషన్‌) వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందా?
హస్తప్రయోగం కూడా సెక్సవల్‌ యాక్ట్‌. పార్టనర్‌ అవసరం లేని చర్య. సెక్స్‌ మాదిరిగానే దీనివల్ల ఆరోగ్యానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. భయం, పాపభీతి వల్ల చాలామంది జంకే మాటే వాస్తవమే గానీ బై అండ్‌ లార్జ్‌ అందరూ ఎప్పుడో ఒకప్పుడు చేసే పని. ఈ ప్రక్రియ వల్ల ఇంకో అడ్వాంటేజీ కూడా ఉంది. సెక్స్‌ రోగాలు అంటే అవకాశం లేదు.

అంగస్తంభన సమస్య: బెడ్రూమ్‌లో భార్య ముందు ఔట్

రతి క్రీడా సమయంలో, హస్తప్రయోగానికి పాల్పడినప్పుడు, అంగ చూషణ ఘట్టంలో సంతృప్తికరమైన రీతిలో అంగం స్థంభించకపోవడాన్ని అంగస్థంభనగా భావించవచ్చు. అరుదుగా ఇలాంటి ఇబ్బంది తలెత్తిన పక్షంలో దీనిని ఒక సమస్యగా పరిగణించవలసిన అవసరం లేదని లైంగిక సమస్యలను పరిష్కరించే వైద్యులు పేర్కొంటున్నారు.

మగవారిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అంగ స్థంభన సమస్యను చవిచూడటం సర్వసాధారణమైన అంశం. మానసిక ఒత్తిడి, అధిక మోతాదులో మద్యాన్ని స్వీకరించడం ఇంకా చెప్పాలంటే శృంగార భావనలు సంప్రాప్తించకపోవడం కూడా అంగస్థంభన సమస్యకు దారి తీస్తుంది. దీనికి, వయస్సుకు పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారిలో ఏడు శాతం మందికి ఈ తలెత్తే అవకాశం ఉండగా, అదే 50 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారిలో 18 శాతం మందికి ఈ సమస్య చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

అంగస్థంభన సమస్యకు దారితీసే రెండు కారణాలను ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఒకటి శారీరకమైంది కాగా మరొకటి మానసికమైంది. అత్యధిక శాతం కేసులు శారీరకమైన కారణాలతోనే తమ పరిశీలనకు వచ్చినట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. కానీ అంగస్థంభన సమస్యతో సతమతమయ్యే పురుషులు రతి క్రీడలో సుఖాల అంచును త్వరగా చేరుకోవాలని ఆదుర్దా చెందడంలో ఒత్తిడి లేదా ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. దీంతో సమస్య జటిలమవుతుంది.

ఆరోగ్యకరమైన జీవన శైలిని ఆపాదించుకోవడం ద్వారా అంగస్థంభన సమస్యకు దూరంగా ఉండవచ్చు. ధూమపానం, మధ్యపానాలకు స్వస్తి చెప్పడం, ప్రతిరోజు వ్యాయామం, కొవ్వు శాతం తక్కువగా ఉండే ఆహారాన్ని స్వీకరించడం ద్వారా సమస్యను కొని తెచ్చుకుకోండా జాగ్రత్త పడవచ్చు. మధుమేహ వ్యాధి ఉన్నవారు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం మంచిది.