అడగకుండానే చెపుతా
సెక్స్ మీద ఉన్నన్ని అపోహలు మరే ఏ అంశం మీద లేవు అంటే అతిశయోక్తి కాదు. సెక్స్ అంటే పాపం అనే భావన మనలో పాతుకుపోవడమే ఇందుకు కారణం. సెక్స్ సమస్యలను ఎవరికీ చెప్పుకోకుండా మధనపడడం మనవాళ్ళు చేసే పని. అందుకే సెక్స్ పై బోల్డన్ని సందేహాలు. చదువుకున్న వారికి కూడా సరైన పరిజ్ణానం, అవగహన లేదని అనేకమైన పరిశోధనల్లో తేలింది. ముద్దు పెట్టుకుంటే కడుపొస్తుంది అని భయపడే చింతామణులు ఈ రోజుల్లో లేకపోయినా సందేహాలున్న దేహాలకు కొదవలేదు. చాలామందికి ఉండే సందేహాలను ఒక దగ్గర చేర్చి, కూర్చి సమస్యలను తీర్చే శీర్షిక ఇది.
సెక్స్ లో అధికంగా పాల్గొనడం వల్ల శక్తి తగ్గుతుందా?
నో. సెక్స్ కు, శక్తి కోల్పవడానికి సంబంధం లేదు. వీర్యం కోల్పోవడం అంటే శక్తిని వదులుకోవడం కాదు. నిజానికి వీర్యం ఉత్పత్తి అనేది మన చేతిలో లేదు. మీరు సెక్స్ లో పాల్గొన్న, పాల్గొనకపోయిన అది ఎలాగూ పోతుంది-నిద్రలో. సో... దాని గురించి ఆందోళన చెందడం దండగ. మన శరీరం నుంచి వెలువడే మూత్రం, కన్నీళ్ళు, లాలాజలం లాగా వీర్యం కూడా మామూలు ద్రవమే. కాకపోతే మిగతా ద్రవాలు పిల్లలను పుట్టించలేవు. అదే తేడా.
హస్తప్రయోగం(మాస్టర్బేషన్) వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందా?
హస్తప్రయోగం కూడా సెక్సవల్ యాక్ట్. పార్టనర్ అవసరం లేని చర్య. సెక్స్ మాదిరిగానే దీనివల్ల ఆరోగ్యానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. భయం, పాపభీతి వల్ల చాలామంది జంకే మాటే వాస్తవమే గానీ బై అండ్ లార్జ్ అందరూ ఎప్పుడో ఒకప్పుడు చేసే పని. ఈ ప్రక్రియ వల్ల ఇంకో అడ్వాంటేజీ కూడా ఉంది. సెక్స్ రోగాలు అంటే అవకాశం లేదు.